
ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న 'సామ' ఔట్‌సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 260 మంది కంటెంట్ మోడరేటర్ల తొలగింపు ప్రక్రియకు కెన్యా కోర్టు బ్రేక్ వేసింది.
మెటా, కెన్యా-ఆధారిత ఔట్‌సోర్సింగ్ సంస్థ ఉద్యోగులను తొలగించకుండా న్యాయమూర్తి మాథ్యూస్ న్డుమా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కంటెంట్ మోడరేటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
గత వారం ఫేస్‌బుక్ నైరోబీ మోడరేషన్ హబ్‌లోని 43 మోడరేటర్లను తొలగించగా, అది చట్టవిరుద్ధం అంటూ ఉద్యోగులు కెన్యా కోర్టును ఆశ్రయించారు.
ఫేస్‌బుక్
కోర్టు ఆదేశాలపై స్పందించిన ఔట్ సోర్సింగ్ సంస్థ
ఫేస్‌బుక్‌లో వేరే ఔట్ సోర్సింగ్ సంస్థ ద్వారా తాము ఉద్యోగాన్ని పొందనీయకుండా సామా సంస్థ తమను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఉద్యోగులు కోర్టుకు వెల్లడించారు.
ఈ కేసులో విచారణ జరిపిన ఈ ఆర్థిక సంవత్సరం కంటెంట్ మోడరేటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా కోర్టు అడ్డుకున్నది.
దీనిపై స్పందించిన సామ సంస్థ ఏ సందర్భంలోనైనా (మార్చి చివరి నాటికి) ఎవరినీ తొలగించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. కోర్టు జారీ చేసిన ఆదేశాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పింది.