మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, మెటాలో నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈసారి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. గత సంవత్సరం, మెటా తన ఖర్చులను తగ్గించుకోవడానికి,ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి 13% మంది ఉద్యోగులను అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. పడిపోతున్న ఆదాయం కారణంగా కంపెనీ కష్టాల్లో పడింది. కంపెనీ షేర్లు పతనంమయ్యాయి. అయితే ఉద్యోగాల కోత, ఊహించిన దాని కంటే మెరుగైన త్రైమాసిక ఫలితాల కారణంగా పరిస్థితి మెరుగు అయ్యింది. కొత్త తొలగింపులలో మేనేజర్ స్థాయి ఉద్యోగులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జుకర్‌బర్గ్ మెటాలో నిర్వహణ పాత్రలు అంటే మేనేజర్ స్టయి ఉద్యోగులను తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారు.
పనితీరు సమీక్షలో సంస్థ 10% అంటే దాదాపు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇచ్చింది
ఈ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి సిఈఓ మానవ వనరులు, న్యాయవాదులు, ఆర్థిక నిపుణులు, ఉన్నత అధికారులను నియమించినట్లు వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ, జుకర్‌బర్గ్ 2023ని సమర్థత సంవత్సరంగా మార్చాలని పేర్కొన్నారు. సంస్థ తాజా పనితీరు సమీక్ష నేపథ్యంలో మరిన్ని తొలగింపులపై కసరత్తులు చేస్తున్నట్లు మెటా నివేదిక ద్వారా తెలిసింది. సంస్థలో 10% అంటే దాదాపు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన ప్రకారం, మెటాలోని కొంతమంది ఉద్యోగులు తక్కువ రేటింగ్ రాగానే కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు.