Page Loader
ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా
ఉద్యోగుల తొలగింపుల తర్వాత కంపెనీ స్టాక్ 80% పైగా పెరిగింది

ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 07, 2023
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్ బుక్-పేరెంట్ సంస్థ మెటా ఈ వారంలో మరిన్ని ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. నవంబర్‌లో 11,000 ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మందిని తొలగించారు. మెటా 2022 ఆర్థిక అనిశ్చితి, పడిపోతున్న ప్రకటన ఆదాయంతో టిక్‌టాక్‌తో పోటీ పడుతుంది. 2012లో తర్వాత కంపెనీ ఆదాయం తొలిసారి పడిపోయింది. ఈ తొలగింపులు మెటా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని కంపెనీ భావిస్తుంది. కొత్త రౌండ్ ఉద్యోగాల కోతలతో తన ఆర్థిక లక్ష్యాలను సాధించాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్‌లను ఉద్యోగుల లిస్ట్ ను తయారు చేయమని కోరినట్లు సమాచారం.

మెటా

తొలగింపుల తర్వాత కంపెనీ స్టాక్ 80% పైగా పెరిగింది

మార్క్ జుకర్‌బర్గ్ పితృత్వ సెలవుపై వెళ్లేలోపు దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే వారంలోగా ఎంత మందిని తొలగిస్తారనేది తెలుస్తుంది. 2022లో కంపెనీ మార్కెట్‌లో కష్టాల్లో పడింది. తొలగింపులను ప్రకటించిన సమయం నుండి (నవంబర్ 9, 2022) మార్చి 6 వరకు, కంపెనీ స్టాక్ 80% పైగా పెరిగింది. మరిన్ని ఉద్యోగాల కోతలతో మార్కెట్లో మరిన్ని లాభాలను ఆర్జించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 2022 నుండి మెటా ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. గత నెల పనితీరు సమీక్షలో దాదాపు 7,000 మంది ఉద్యోగులు సబ్‌పార్ రేటింగ్‌లు పొందడం వల్ల ఇటువంటి పుకార్లు ప్రారంభమయ్యాయి. అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తే తమకు బోనస్ అందుతుందో లేదోనని చాలా మంది భయపడుతున్నారు.