LOADING...
Trade deal: అమెరికా ట్రేడ్‌డీల్‌తో రైతులకు ఎలాంటి నష్టం లేదు : పీయూష్‌ గోయల్
అమెరికా ట్రేడ్‌డీల్‌తో రైతులకు ఎలాంటి నష్టం లేదు : పీయూష్‌ గోయల్

Trade deal: అమెరికా ట్రేడ్‌డీల్‌తో రైతులకు ఎలాంటి నష్టం లేదు : పీయూష్‌ గోయల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్‌ డీల్‌ వల్ల భారత రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టంచేశారు. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని రంగాల్లో సున్నాశాతం సుంకాలు అమలు చేయడం వల్ల పోటీతత్వం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా సేంద్రీయ ఎరువులు, అలంకరణ సామగ్రి, యంత్రాల ఎగుమతులకు భారత్‌కు గొప్ప అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.

Details

రైతులకు ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే కొన్ని ఉత్పత్తులపై సున్నాశాతం సుంకాలు నిర్ణయించామని గోయల్‌ వివరించారు. అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందం వల్ల భారత్‌కు గణనీయమైన లాభాలు చేకూరనున్నాయని, ముఖ్యంగా ఎగుమతుల పరంగా దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులకు ఈ ట్రేడ్‌ డీల్‌లో పూర్తి స్థాయి రక్షణ కల్పించామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

Advertisement