
Flash Pay: కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం ఫెడరల్ బ్యాంక్ 'ఫ్లాష్ పే'
ఈ వార్తాకథనం ఏంటి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. NCMC సాంకేతికతతో తయారైన ఈ స్మార్ట్ కీ చైన్‌తో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయొచ్చు.
కస్టమర్‌లు పిన్ లేకుండా కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను రూ.5000 వరకు పేమెంట్లు చేయొచ్చు. ఆపై మొత్తానికి పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఏదైనా POS టెర్మినల్‌లో రోజువారీ లావాదేవీ పరిమితి ₹1,00,000గా సెట్ చేయబడింది. ఎన్‌పీసీఐతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఈ స్మార్ట్ కీ చైన్ వినియోగదారులను NCMC-ప్రారంభించబడిన మెట్రో స్టేషన్‌లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయచ్చు.
మెట్రో స్టేషన్‌లకు నిర్దిష్ట టిక్కెట్లు లేదా కార్డ్‌లను కొనుగోలు చేయడానికి లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదు.
Details
ఈ కీ చైన్ ఎలా తీసుకోవచ్చంటే..
ఫెడరల్ బ్యాంక్ లో సేవింగ్స్/ కరెంట్ ఖాతా ఉన్నవారు నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్ కోసం అప్ప్లై చేసుకోవాలి.
ఫెడరల్ బ్యాంక్ మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్ కాలింగ్ ద్వారా పిన్ సెట్ చేసుకోవచ్చు.
ఎప్పుడైనా బ్లాక్/అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.
డెబిట్ కార్డు లాగానే బ్యాంక్ ఈ స్మార్ట్ కీ చైన్ ధరను రూ.499గా నిర్ణయించింది. ఆ తర్వాత ఏడాదికి రూ.199+tax చొప్పున ఛార్జి చేస్తారు.
టెర్మినల్‌కు 3-4 సెంటీమీటర్ల దూరం పేమెంట్లు చేయొచ్చు. రోజులో ఐదు లావాదేవీలకు అనుమతిస్తారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫెడరల్ బ్యాంక్ చేసిన ట్వీట్
Tired of slow and lengthy payment methods? Ready for something faster, smoother, and totally hassle-free? Introducing Federal Bank FlashPay!
— Federal Bank Ltd (@FederalBankLtd) March 22, 2024
Learn more at https://t.co/DaRqqQ8Mg0#FlashPay #RuPay @RuPay_npci pic.twitter.com/zjQhAapwX3