Page Loader
'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు
'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు

'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు

వ్రాసిన వారు Stalin
Aug 01, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాలో తమ విమాన సర్వీసుల్లో బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్‌లైన్‌గా భారతీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవతరించింది. బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ మంగళవారం ఉదయం 9:31 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీనికి ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు, ఆకాశ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. ఆకాశ ఎయిర్ వృద్ధి, విస్తరణ ప్రణాళికలో దీన్ని మైలురాయిలా కంపెనీ పేర్కొంది. కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే ఆకాశ ఎయిర్ ఎయిర్ లైన్స్ విమానా సంఖ్య 20కి చేరుకుంది. బోయింగ్‌కు ఆకాశ 737-8 విమానాలు 23, 737-8-200 విమానాలు 57 ఆర్డర్ ఇచ్చింది. అన్నీ ఐదేళ్లలో డెలివరీ అయ్యేలా కంపెనీ ఒప్పందం చేసుకుంది.

ఎయిర్ లైన్

2023 చివరి నాటికి మూడు అంకెల ఆర్డర్‌పై 'ఆకాశ ఎయిర్' ఫోకస్ 

బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ రాకపై ఆకాశ ఎయిర్ ఫౌండర్ సీఈఓ వినయ్ దూబే స్పందించారు. బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌ రాక అంతర్జాతీయ స్థాయిలో తమ వృద్ధిని తెలియజేస్తుందని వెల్లడించారు. కేవలం 12 నెలల్లో 20 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు చేరుకోవడం ఆకాశ సాధించిన రికార్డుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆకాసా విమానయాన సంస్థ కేవలం ఒక సంవత్సరంలోనే 4 మిలియన్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. 2023 చివరి నాటికి మూడు-అంకెల ఆర్డర్‌తో ఆకాసా సంస్థ మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.