LOADING...
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సంచలనం.. 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అద్భుతం
ఫ్లిప్‌కార్ట్‌ సంచలనం.. 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అద్భుతం

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సంచలనం.. 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అద్భుతం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 23, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న 13 నిమిషాల్లో డెలివరీ సేవలు అత్యద్భుతమని వాల్‌మార్ట్ ఇంక్ ప్రెసిడెంట్, సీఈఓ జాన్ ఫర్నర్ ప్రశంసించారు. ఫ్లిప్‌కార్ట్‌కు మాతృసంస్థ అయిన వాల్‌మార్ట్‌కు మెజార్టీ వాటా ఉన్న విషయం తెలిసిందే. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.50 లక్షల కోట్లు) పెట్టుబడితో కొనుగోలు చేసింది. అనంతరం ఆ వాటాను 80 శాతానికి పైగా పెంచుకుంది. వినియోగదారులకు ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేయడంలో ఫ్లిప్‌కార్ట్ చూపిస్తున్న సామర్థ్యం, వినూత్న విధానాలు ఆకట్టుకుంటున్నాయని జాన్ ఫర్నర్ పేర్కొన్నారు.

వివరాలు

ఫ్లిప్‌కార్ట్ 800కి పైగా కేంద్రాలు

13 నిమిషాల్లో డెలివరీ సేవలను అందించడం నిజంగా అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు 2026-27 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా చేశారు. వేగవంతమైన డెలివరీ సేవల కోసం ఫ్లిప్‌కార్ట్ 800కి పైగా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా భారత్‌లో 30కి పైగా నగరాల్లో సగటున 13 నిమిషాల్లోపే డెలివరీ ఆర్డర్లు పూర్తి అవుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా, వాల్‌మార్ట్ ఫిబ్రవరి-జనవరి ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది. తాజా త్రైమాసికంలో వాల్‌మార్ట్ నికర లాభం 7.3 శాతం పెరిగి 177.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించింది.

వివరాలు

సేవలను మరింత విస్తరించనున్న ఫ్లిప్‌కార్ట్

అదేవిధంగా లాస్ట్ మైల్ పార్సిల్ డెలివరీ సేవల కోసం భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్)తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ పార్సిల్‌లకు తపాలా శాఖ లాస్ట్ మైల్ డెలివరీ సేవలను అందించనుంది. ఇండియా పోస్ట్‌కు ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని పట్టణాలు, చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెలివరీ సేవలను ఫ్లిప్‌కార్ట్ మరింత విస్తరించనుంది .

Advertisement