Page Loader
ఈ నలుగురు ఇండో అమెరికన్ వనితలు చాలా రిచ్.. ఫోర్బ్స్ జాబితాలో చోటు 
ఫోర్బ్స్ జాబితాలో 4 అమెరికన్ భారతీయ మహిళలకు చోటు

ఈ నలుగురు ఇండో అమెరికన్ వనితలు చాలా రిచ్.. ఫోర్బ్స్ జాబితాలో చోటు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 10, 2023
06:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల జాబితా విడుదలైంది. ఈ మేరకు నలుగురు ఇండో అమెరికన్ వనితలు స్థానం సంపాదించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథి, నేహా నార్ఖేడే, ఇంద్రా నూయి ఈ కీర్తిని దక్కించుకున్నారు. అగ్రదేశం అమెరికాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఉమెన్స్ గా రాణిస్తూ సగటు సంపద 124 బిలియన్‌ డాలర్లు కలిగిన 100 మంది మహిళా వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో చోటు సంపాదించారు. 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్‌ యూఎస్ లోని సిలికాన్ వ్యాలీ ఇంజినీర్, సిస్కో మాజీ నిఫుణురాలు. ఫోర్బ్స్ 2023 సంపన్న మహిళల లిస్టులో 15వ ర్యాంకులో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపుగా 2.2 బిలియన్ డాలర్లు.

DETAILS

తొలి అమెరికాయేతర మహిళగా ఇంద్రా నూయి రికార్డు

ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 68 ఏళ్ల నీర్జా సేథి, 25వ ర్యాంకు సంపాదించారు. ఆమె నికర సంపద విలువ 990 మిలియన్‌ డాలర్లు. 38 ఏళ్ల నేహా నార్ఖెడే, 50వ స్థానం దక్కించుకున్నారు. అయితే నేహా నార్ఖెడే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి వ్యాపారవేత్తగా మారారు. ఆమె నికర ఆస్తుల విలువ 520 మిలియన్‌ డాలర్లు. ఫోర్బ్స్ 2023 లిస్టులో 77వ స్థానం సంపాదించుకున్న 67 ఏళ్ల ఇంద్రా నూయి నికర సంపద విలువ 350 మిలియన్‌ డాలర్లు. యూఎస్ లోని టాప్‌ 50 కంపెనీల్లో పెప్సికోను ఒకటిగా నిలిపారు. చెన్నైలో జన్మించిన నూయి, అమెరికన్ టాప్‌ కంపెనీలో అతిపెద్ద హోదాలో ఉన్న తొలి అమెరికాయేతర మహిళగా నిలిచారు.