Farmers welfare: చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు.. నిర్మలమ్మ తీపి కబురు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్‌లో చిన్న,సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రైతులను అధిక దిగుబడి,మార్కెట్‌లో ఎక్కువ విలువ ఉన్న పంటల వైపుకు ప్రోత్సహిస్తామని ఆమె స్పష్టం చేశారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. అలాగే, కాయలు కాయని చెట్లను తీసివేసి కొత్త చెట్లను నాటడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు.
వివరాలు
తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల పెంచే రైతులకు ఊతం
దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కూడా కేంద్రం సాయం అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక, పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. ఈ బడ్జెట్ వల్ల చిన్న రైతులు ఆదాయం పెరుగుదల, పంటల రక వైవిధ్యం, మార్కెట్‌లో విలువ పెరుగుదల పొందగలరని అంచనా.