
UPI Rules: యూపీఐలో కీలక మార్పులు.. నేటి నుంచి అమల్లోకి కొత్తరూల్స్..
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)లో August 1, 2025 నుండి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ఈ మార్పులను తీసుకువచ్చింది. బ్యాలెన్స్ తనిఖీలు, ఆటోమేటెడ్ చెల్లింపులు తదితర అంశాల్లో జరిగిన ఈ మార్పులు వినియోగదారులతో పాటు బ్యాంకులు, వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పుడు వాటిపై పూర్తిగా తెలుసుకుందాం.
వివరాలు
రోజు వారీగా బ్యాలెన్స్ చెక్ చేసే పరిమితి
ఇప్పటివరకు వినియోగదారులు ఎన్ని సార్లైనా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. కానీ ఇకపై ఒక్క రోజులో గరిష్ఠంగా 50 సార్లకు మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు రెండు యాప్‌లను వినియోగిస్తుంటే ఈ పరిమితి వేర్వేరుగా ఉంటుంది. యూపీఐ ఆటోపే లావాదేవీలకు టైమ్ స్లాట్.. UPI AutoPay ఫీచర్ ద్వారా జరిగే లావాదేవీలకు ఇకపై ఖచ్చితమైన టైమ్ స్లాట్‌లు అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు - సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, బిల్లుల వంటి రికరింగ్ చెల్లింపులు ఇకపై కేవలం మూడు సమయాల్లోనే ప్రాసెస్ అవుతాయి: ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9.30 గంటల తర్వాత.
వివరాలు
యూపీఐ ఆటోపే లావాదేవీలకు టైమ్ స్లాట్..
ఈ మార్పుల వల్ల వినియోగదారులకు ప్రత్యక్ష ఇబ్బంది ఏమీ ఉండదు. వారి ఆటోమేటిక్ పేమెంట్లు ఇప్పటిలానే కొనసాగుతాయి. అయితే వ్యాపారులు తమ చెల్లింపుల వసూలు సమయాలను ఈ టైమ్ స్లాట్‌ల ప్రకారం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐని మరింత ఆధారపడదగినదిగా, ప్రత్యేకించి రద్దీ సమయాల్లో అంతరాయాలకు తావులేకుండా లావాదేవీలు సజావుగా సాగేలా తీర్చిదిద్దడం ఈ మార్పుల లక్ష్యం.
వివరాలు
లింక్ చేసిన ఖాతాల తనిఖీలకు పరిమితి
ఒకే మొబైల్ నంబర్‌కు సంబంధించి ఎంతమంది ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో చూసే ఆప్షన్‌కు కూడా పరిమితి విధించారు. వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 25 సార్ల వరకే ఈ తనిఖీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షన్ స్థితిని మూడు సార్లు మాత్రమే పరిశీలించవచ్చు UPI లావాదేవీ అనంతరం దాని స్థితిని తెలుసుకోవాలనుకుంటే.. ఇది పూర్తయిందా లేదా అనేది తెలుసుకోవడం ఇప్పటి వరకు అనేకసార్లు చెక్ చేసే అవకాశం ఉంది. ఇకపై మాత్రం గరిష్ఠంగా మూడు సార్ల వరకు మాత్రమే స్టేటస్ చెక్ చేయవచ్చు. అదే లావాదేవీకి సంబంధించి మరలా చెక్ చేయాలంటే కనీసం 90 సెకన్ల గ్యాప్ తప్పనిసరి.
వివరాలు
లబ్ధిదారుడి పూర్తి పేరు యాప్‌లో కనిపిస్తుంది
మీరు డబ్బు పంపే ముందు, స్వీకర్త UPI ID లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ వ్యక్తి బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన పూర్తి పేరు యాప్‌లో చూపించబడుతుంది. ఇది చెల్లింపు తప్పుడు ఖాతాకు వెళ్లకుండా నిరోధించడమే కాకుండా, మోసాలనూ అరికట్టేందుకు కీలకంగా నిలుస్తుంది. ఈ మార్పులు మొత్తం యూపీఐ వ్యవస్థను మరింత గణనీయంగా, భద్రతా పరంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ఉన్నాయని చెప్పవచ్చు. వినియోగదారుల సమాచారం కోసం, మార్పులను గమనించి, తగిన విధంగా తమ ఆచరణను సర్దుబాటు చేసుకోవడం అవసరం.