LOADING...
Fuel Tax: విమాన ఇంధనంపై 100% పన్ను మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం
విమాన ఇంధనంపై 100% పన్ను మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం

Fuel Tax: విమాన ఇంధనంపై 100% పన్ను మినహాయింపు.. కేంద్రం సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు, అమెరికా జోక్యంతో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆందోళన పెరుగుతోంది. ఈ పరిణామాల ప్రభావంగా గ్లోబల్‌గా ఇంధన సరఫరా వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా కేంద్రం పలు కీలక ప్రకటనలు చేసింది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలను తగ్గించిన ప్రభుత్వం, ఇప్పుడు విమాన ఇంధనం (ATF) పై కూడా భారీ ఉపశమనం కల్పించింది. డొమెస్టిక్‌ విమానాల కోసం ఉపయోగించే ఇంధనంపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లైంది.

వివరాలు 

ఎగుమతులపై కట్టడి

దేశంలో ఇంధన లభ్యత తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై సుంకాలు విధించింది. డీజిల్‌ ఎగుమతిపై లీటరుకు రూ. 21.5 సుంకం విధించగా, విమాన ఇంధనం (ATF) ఎగుమతిపై లీటరుకు రూ. 29.5 సుంకాన్ని అమలు చేసింది. ఈ చర్యల ద్వారా ఇంధన కంపెనీలు ఎక్కువ లాభాల కోసం విదేశాలకు సరఫరా చేయకుండా, దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. దీని వల్ల దేశంలో ఇంధన సరఫరా స్థిరంగా ఉండే అవకాశాలు పెరిగాయి.

Advertisement