Page Loader
Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని మించి ఆదాయం
దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని మించి ఆదాయం

Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని మించి ఆదాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2024
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీం కోర్టు తీర్పుతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద(Gautam Adani) అమాంతం పెరిగింది. ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలోనే నెం.1 సంపన్నుడిగా గౌతమ్ అదానీ అవతరించాడు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు అదానీ సంపద విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉన్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) 97 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానం, ప్రపంచంలో 13వ స్థానానికి దిగజారిపోయాడు. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచాడు.

Details

ఒక్క రోజులోనే అదానీ సంపద 7.6 బిలియన్ డాలర్ల పెరుగుదల

బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం కొత్త ఏడాదిలో ప్రపంచంలోని టాప్-20 బిలియనీర్లతో ముగ్గురి నికర విలువ మాత్రమే పెరిగినట్లు పేర్కొంది. వీటిలో అదానీ, అంబానీలే కాకుండా అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ కూడా ఉన్నారు. అదానీ సంపద కేవలం 24 గంటల్లోనే 7.6 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. సుప్రీం కోర్టు గౌతమ్ అదానీకి అనుకులంగా ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ కంపెనీ షేర్లు పెరిగాయి. ఇక అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకరోజు క్రితం రూ.14.47 లక్షల కోట్ల నుంచి బుధవారం నాటికి రూ.15.11 లక్షల కోట్లకు పెరగడం విశేషం.