రిజల్యూషన్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయనున్న గో ఫస్ట్ రుణదాతలు
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ నియంత్రణ పూర్తిగా రుణదాతల చేతుల్లోకి వెళ్లింది. ఈ మేరకు దాఖలైన దివాళా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సీ.ఎల్.టీ) గతంలోనే ఆమోదించింది. అయితే తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థగా పేరున్న ఈ సంస్థని రుణదాతలే నియంత్రిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పరిష్కార ప్రక్రియను మొత్తం క్రెడిటార్స్ కమిటీ తమ అధీనంలోకి తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఈ ప్రక్రియ కోసం రుణదాతల కమిటీ (CoC) కీలకమైన దివాలా నిపుణులను ఏర్పాటు చేసింది. దివాలా ప్రక్రియను సాఫీగా, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థ వీరిని ముందుగానే నియమించినట్లు సమాచారం. మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్స్, ప్రాసెస్ అడ్వైజర్స్ సహా లీగల్ ఏజెన్సీ నియామకవడం గమనార్హం.
లాక్ డౌన్ సహా ఫ్లైట్ ఇంజిన్ సమస్యలే దెబ్బతీశాయి : గో ఫస్ట్
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో మూడో స్థానంలో నిలిచిన గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ దివాళా తీసినట్లు గతంలోనే ఆ సంస్థ ప్రకటించింది. లాక్ డౌన్ సహా ఇంజిన్ సమస్యలు తమను ఆర్థికంగా ఘోరంగా దెబ్బతిశాయని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్పట్లోనే దృష్టికి తీసుకెళ్లింది. సంస్థకు భారీ రుణాలున్న నేపథ్యంలో వాట్ని తిరిగి కట్టలేని పరిస్థితికి దిగజారామని తెలిపింది.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రుణాలే గో ఫస్ట్ ను దివాలా తీసేలా ప్రేరేపించాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే రూ. 6,500 కోట్లకు పైగా గో ఫస్ట్ రుణం తీసుకుంది. దీంతో కలిపి సంస్థకు మొత్తంగా రూ. 11,000 కోట్లకుపైగా బకాయిలు ఉండటం కొసమెరుపు.