Page Loader
నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు
నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు

నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు

వ్రాసిన వారు Stalin
May 02, 2023
06:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నగదు కొరత కారణంగా మే 3, 4 తేదీల్లో అన్ని విమానం సర్వీసులను రద్దు చేసినట్లు గో ఫస్ట్ మంగళవారం తెలిపింది. క్యాష్ అండ్ క్యారీ మోడల్‌లో పనిచేసే గో ఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చమురు మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీలు) బకాయిలు చెల్లించడానికి నిధులు లేవు. క్యాష్ అండ్ క్యారీ మోడల్ అంటే ప్రతి సర్వీసుకు చమురు మార్కెటింగ్ కంపెనీలకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో చమురు సరఫరాను ఓఎంసీలు నిలిపివేశాయి

విమానం

గో ఫస్ట్‌ నుంచి నిష్క్రిమించేందుకు సిద్ధమవుతున్న వాడియా గ్రూప్ 

నగదు కొరతతో కారణంగా గో ఫస్ట్ ఎయిర్ లైన్ ఇటీవల నిధులను పూనుకుంది. వాడియా గ్రూప్ ఆధీనంలో ఉన్న గో ఫస్ట్‌లోని మెజారిటీ వాటాను విక్రయించడానికి లేదా సంస్థ నుంచి పూర్తిగా నిష్క్రమించడానికి భాగస్వాములు వ్యూహాత్మక భాగస్వాములతో చర్చలు జరుపుతున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో గో ఫస్ట్ దాని అతిపెద్ద వార్షిక నష్టాన్నినమోదు చేసింది. గో ఫస్ట్ విమానాలకు ఇంధనాన్ని సరఫరా చేసే ప్రాట్ & విట్నీ కంపెనీతో నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో తీవ్రంగా గతేడాది తీవ్రంగా నష్టపోయింది. భారత ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రకారం, గ్రౌండెడ్ విమానాలు జనవరిలో 8.4 శాతంగా ఉన్న గో ఫస్ట్ మార్కెట్ వాటా మార్చిలో 6.9 శాతానికి పడిపోయింది.