
Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త .. భారీగా తగ్గిన ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో శుభకార్యం ఉంటేనే బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారిపోయింది. పండుగలు,వేడుకల సమయంలో మహిళల ఆభరణాల్లో బంగారం తప్పనిసరి అయింది. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా బంగారం రేట్లు పెరుగుతూ కనిపించగా, ఇంకొన్ని రోజుల్లో మాత్రం తక్కువవుతున్నాయి. ముఖ్యంగా గడచిన మూడు రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర మూడు రోజుల్లో రూ. 1320 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధరలో రూ. 1210 వరకూ తగ్గుదల చోటు చేసుకుంది. కానీ బంగారానికి భిన్నంగా వెండి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో వెండి ధరలో రూ. 200 మేర పెరుగుదల నమోదైంది.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర ప్రస్తుతం రూ. 91,990గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,360గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు రూ. 1,10,000 మార్కును దాటి పోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 1,20,100గా ఉంది. 22 క్యారెట్ల బంగారం చెన్నై - రూ. 91,900, బెంగళూరు - రూ. 91,900, ఢిల్లీ - రూ. 92,140, కోల్‌కతా - రూ. 91,900, ముంబై - రూ. 91,900
వివరాలు
24 క్యారెట్ల బంగారం
చెన్నై - రూ. 1,00,360, బెంగళూరు - రూ. 1,00,360, ఢిల్లీ - రూ. 1,00,510, కోల్‌కతా - రూ. 1,00,360 ,ముంబై - రూ. 1,00,360 వెండి ధరలు ఇలా చెన్నై - రూ. 1,20,100, బెంగళూరు - రూ. 1,10,100, ఢిల్లీ - రూ. 1,10,100, కోల్‌కతా - రూ. 1,10,100, ముంబై - రూ. 1,10,100