LOADING...
Gold and Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి,వెండి ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే?
మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి,వెండి ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే?

Gold and Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి,వెండి ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ లోహాలతో చేసిన ఆభరణాల కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మార్పులు వంటి అంశాల ప్రభావంతో ఈ ధరల్లో తరచూ మార్పులు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ధరలు గణనీయంగా పడిపోతే, మరికొన్ని సందర్భాల్లో వేగంగా పెరుగుతాయి. తాజాగా బుధవారం, ఏప్రిల్ 22న పసిడి, వెండి ధరల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధరలో మార్పు ఎలా ఉందో కూడా పరిశీలిద్దాం.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,16,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,750గా కొనసాగుతోంది. విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,16,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,750గా ఉంది.

వివరాలు 

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ పై ఓ లుక్కేద్దాం..

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,900గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,000గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి రూ.1,54,750గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,850గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,55,990గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,990గా నమోదైంది. బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి రూ.1,54,750గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,850గా ఉంది. కోల్‌కతా, పూణే నగరాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.

Advertisement

వివరాలు 

వెండి ధరలు 

వెండి ధరల విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.2,65,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,74,900గా ఉండగా, విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రూ.77,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.2,65,000గా ఉండగా, ముంబైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Advertisement