Gold and silver: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం,వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు కనిపించాయి. ఇరాన్ కూడా యుద్ధానికి విరామం ప్రకటించిన నేపథ్యంలో పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు తీవ్రంగా నమోదవుతున్నాయి. బుధవారం బంగారం ధరలు అకస్మాత్తుగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,820గా ఉంది. నిన్న ఇది రూ.1,49,840గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.3,980 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,000గా ఉంది. నిన్న రూ.1,37,350గా ఉండగా, ఇవాళ రూ.3,650 పెరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,190గా ఉండగా,నిన్న రూ.1,51,200గా ఉంది.
వివరాలు
వెండి ధర
22 క్యారెట్ల ధర అక్కడ రూ.1,38,590గా ఉండగా,నిన్న రూ.1,38,600గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,820గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,970గా ఉండగా,నిన్న ఇది రూ.1,49,990గా ఉంది. 22 క్యారెట్ల ధర నిన్న రూ.1,37,500గా ఉండగా, బుధవారం రూ.1,41,150గా కొనసాగుతోంది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉండగా, నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది. అంటే ఒక్కరోజులోనే రూ.10వేల పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900గా ఉండగా, మంగళవారం రూ.2.55 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా వెండి ధరలు రూ.2.54 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.