LOADING...
Gold Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ పెరుగుదల.. ఎంత పెరిగిందంటే..?
ఎంత పెరిగిందంటే..?

Gold Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ పెరుగుదల.. ఎంత పెరిగిందంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. సోమవారం నుంచి రేట్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెళ్లిళ్ల కాలం ప్రారంభం కావడంతో పసిడి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ధరలు పెరగడం వినియోగదారులకు ప్రతికూల పరిణామంగా మారింది. గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల పరిస్థితి ఇలా ఉంది. హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,570గా నమోదైంది. బుధవారం ఇది రూ.1,55,350గా ఉండగా, ఒక్క రోజులో రూ.220 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.1,42,600గా ఉండగా, బుధవారం రూ.1,42,400గా ఉంది. దీంతో రూ.200 పెరుగుదల నమోదైంది.

వివరాలు 

వెండి ధరలు

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.1,56,230గా ఉండగా,బుధవారం రూ.1,56,220గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.1,43,210గా ఉండగా, నిన్న రూ.1,43,200గా కొనసాగింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,570గా ఉండగా,22క్యారెట్ల ధర రూ.1,42,600గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.1,55,720గా ఉండగా, బుధవారం రూ.1,55,500గా ఉంది. 22క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,42,750గా ఉండగా,నిన్న రూ.1,42,550గా ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల దిశలోనే కొనసాగుతున్నాయి.ఢిల్లీలో కిలో వెండి ధర గురువారం రూ.2,70,100గా ఉండగా,బుధవారం రూ.2,70,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధరరూ.2,75,100గా ఉండగా,నిన్న కూడా ఇదే స్థాయిలో కొనసాగింది. చెన్నైలో కూడా కిలో వెండి ధరరూ.2,75,100గా కొనసాగుతోంది.

Advertisement