Gold Prices: యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా సంయుక్తంగా సైనిక చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు గురైన తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లడంతో బంగారం,వెండిపై డిమాండ్ పెరిగింది. దాంతో పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి.మరికొన్ని రోజులు ఇదే ధోరణి కొనసాగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరల పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం కూడా గోల్డ్,సిల్వర్ రేట్లు మరోసారి పెరిగాయి.ఇవాళ వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివరాలు
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,73,090 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,73,080 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం రూ.1,58,660 వద్ద ట్రేడవుతుండగా, ఆదివారం రూ.1,58,650 వద్ద ముగిసింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,090గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,660 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,72,100గా ఉంది. నిన్న ఇది రూ.1,72,090 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల ధర ఇప్పుడు రూ.1,57,760గా ఉండగా, ఆదివారం రూ.1,57,750 వద్ద స్థిరపడింది.
వివరాలు
బంగారం ధరలు ఇలా..
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,73,090 వద్ద ఉంది. నిన్న ఇది రూ.1,73,080 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,660గా ఉండగా, ఆదివారం రూ.1,58,650 వద్ద నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,240 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,810గా ఉంది.
వివరాలు
వెండి ధరలు ఇవే..
ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,94,900 వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఇది రూ.2,95,000 వద్ద ముగిసింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,25,100గా ఉంది. నిన్న ఇది రూ.3.25 లక్షలుగా నమోదైంది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,25,100 వద్ద కొనసాగుతోంది. నిన్న కూడా రూ.3.25 లక్షలుగా ఉంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర ప్రస్తుతం రూ.2,94,900గా ఉంది. ఆదివారం ఇది రూ.2.95 లక్షలుగా నమోదైంది. యుద్ధ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ఇంకా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.