Gold Rate: భారీగా దిగొచ్చిన బంగారం రేట్లు.. వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరల్లో భారీ స్థాయిలో కోత పడింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే పసిడి ధరలు దాదాపు 10 శాతం మేర తగ్గిపోయాయి. ధన త్రయోదశి సందర్భంలో రూ.1.30లక్షల మార్కును తాకిన బంగారం, ప్రస్తుతం రూ.1.20 లక్షల స్థాయికి పడిపోయింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం,బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,20,810గా ఉంది. అలాగే,22 క్యారెట్ బంగారం ధర రూ.1,10,740కు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ప్రస్తుతం రూ.1,50,900గా ఉంది.హైదరాబాద్‌లో కూడా అదే రేట్లు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,20,810, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ బంగారం రూ.1,10,740గా ఉంది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 3941 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వారం వెండి ధరలు సుమారు 6 శాతం మేర తగ్గాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, ధరల్లో సహజ సవరణ జరగడం, అలాగే అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడడం వంటి అంశాలు బంగారం, వెండి ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో ధరలు మరో 5 నుంచి 10 శాతం వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు.
వివరాలు
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవీ
చెన్నై: ₹1,20,810; ₹1,10,740; ₹91,990 ముంబై: ₹1,20,810; ₹1,10,740; ₹90,610 ఢిల్లీ: ₹1,20,960; ₹1,10,890; ₹90,760 కోల్‌కతా: ₹1,20,810; ₹1,10,740; ₹90,610 బెంగళూరు: ₹1,20,810; ₹1,10,740; ₹90,610 హైదరాబాద్: ₹1,20,810; ₹1,10,740; ₹90,610 కేరళ: ₹1,20,810; ₹1,10,740; ₹90,610 పూణె: ₹1,20,810; ₹1,10,740; ₹90,610 వడోదరా: ₹1,20,860; ₹1,10,790; ₹90,660 అహ్మదాబాద్: ₹1,20,860; ₹1,10,790; ₹90,660
వివరాలు
కిలో వెండి ధరలు ఇలా..
చెన్నై: ₹1,64,900 ముంబై: ₹1,50,900 ఢిల్లీ: ₹1,50,900 కోల్‌కతా: ₹1,50,900 బెంగళూరు: ₹1,51,900 హైదరాబాద్: ₹1,64,900 కేరళ: ₹1,64,900 పుణే: ₹1,50,900 వడోదరా: ₹1,50,900 అహ్మదాబాద్: ₹1,50,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.