LOADING...
Gold and Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ రాజకీయాలు, భౌగోళిక పరిస్థితుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవలి రోజుల్లో గణనీయంగా మార్పులు చూపిస్తున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,528గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,234కు చేరగా, 18 క్యారెట్ల పసిడి ధర రూ.11,646 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా పెరుగుదల దిశగా కదులుతూ గ్రాముకు రూ.274గా, కిలోకు రూ.2,74,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,430గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,490గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,340గా ఉంది.

వివరాలు 

వెండి ధరలు 

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,990కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,990గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,280గా, 22 క్యారెట్ల ధర రూ.1,42,340గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి. వెండి ధరల విషయానికి వస్తే, ఢిల్లీలో కిలో వెండి రూ.2,74,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.2,79,900కు చేరగా, ముంబైలో రూ.2,74,900గా కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ.2,79,900గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడలో కూడా కిలో వెండి ధర రూ.2,79,900కు చేరింది.

Advertisement