LOADING...
Gold, Silver Prices Surge Again: మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు .. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు .. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

Gold, Silver Prices Surge Again: మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు .. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇటీవల కాస్త తగ్గిన బంగారం,వెండి ధరలు శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా విలువైన లోహాలకు డిమాండ్‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌లోనూ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,200కు చేరుకుంది. గత రోజుతో పోలిస్తే రూ.3 వేలకుపైగా పెరగడం గమనార్హం. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి రూ.2.49 లక్షలకు చేరగా, ఒక్కరోజులోనే దాదాపు రూ.9 వేల మేర పెరిగింది.

వివరాలు 

పశ్చిమాసియాలో పరిణామాలు.. ప్రపంచ మార్కెట్లపై ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు బలంగా ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు ఔన్సు బంగారం ధర 4,205 డాలర్లకు చేరుకోగా,గత ట్రేడింగ్‌తో పోలిస్తే 100 డాలర్లకుపైగా పెరిగింది. ఔన్సు వెండి ధర 67.32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధర రూ.1.50 లక్షలు, సిల్వర్‌ ఫ్యూచర్స్‌ ధర రూ.2.43 లక్షల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై తాజా దాడులను విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. టెహ్రాన్‌తో చర్చలు దాదాపు సానుకూల దశకు చేరుకున్నాయని, తమ ప్రతిపాదనలకు ఆ దేశ అగ్రనాయకత్వం అంగీకరించినట్లు వెల్లడించారు.

వివరాలు 

బలపడిన రూపాయి

దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు భారత కరెన్సీ రూపాయి విలువ కూడా బలపడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలు పుంజుకుని 95.25 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో రానున్న రోజుల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement