LOADING...
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ముడి చమురు ధరలతో పాటు బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు నేడు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. మరోవైపు వెండికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్‌ కొనసాగుతుండటంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు 70శాతం వరకు ఎగబాకాయి. వెండి ధరలు అయితే మరింతగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది వెండి ధరలు దాదాపు 150 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు

బుధవారం కూడా బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఇదే సమయంలో మే 28న తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,828 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,509గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,871 వద్ద కొనసాగుతోంది. తులం ప్రకారం చూస్తే.. 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,58,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,45,090 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,18,710గా నమోదైంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ధరలు.. 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,828, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,509, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,871 వద్ద ఉన్నాయి. విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,828గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,509, 18 క్యారెట్ల బంగారం గ్రాము రూ.11,871గా నమోదైంది. అమరావతి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, ఖమ్మం, నిజామాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి.

Advertisement

వివరాలు 

వెండి ధరలు

ఇక వెండి ధరలు చూస్తే.. గ్రాము వెండి ధర రూ.284.90వద్ద కొనసాగుతోంది. తులం వెండి ధర రూ.2,849గా ఉంది. కిలో వెండి ధర రూ.2,84,900గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధరపై రూ.100 తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది. విజయవాడ,విశాఖపట్నం,గుంటూరు,తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉండగా,కలకత్తాలో రూ.2,84,900,బెంగళూరులో రూ.2,85,100గా నమోదైంది. నగల తయారీలో ప్రధానంగా 22 క్యారెట్ల బంగారాన్నే వినియోగిస్తారు.ఇందులో రాగి వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను సాధారణంగా 916స్వచ్ఛతగా పరిగణిస్తారు. అందుకే బంగారం కొనుగోలుదారులు ఎక్కువగా ఈ ధరలపైనే దృష్టి పెడతుంటారు.

Advertisement

వివరాలు 

రూపాయి విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణం

బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయ మార్కెట్‌లో కూడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుదల కనిపిస్తుంది. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు మరో కారణంగా మారింది.

Advertisement