
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. తులం బంగారం కొనాలంటే ఇప్పుడు చేతిలో కనీసం లక్ష రూపాయలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రోజు స్వల్పంగా తగ్గితే, వెంటనే మరుసటి రోజు భారీగా పెరుగుతుంది. తాజాగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం, ఒక్క తులం బంగారం ధర రూ.1,00,410గా ఉంది. ఇవి ఉదయం 6 గంటలకు నమోదైన రేట్లు. దినంలో ఇది మరింత పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా అలాగే ఉండిపోవచ్చు.
వివరాలు
ప్రాంతాలవారీగా బంగారం ధరలను పరిశీలిస్తే:
ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,560గా ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.93,110గా ఉంది. ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,410గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.92,960. హైదరాబాద్: ఇక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,01,410 కాగా, 22 క్యారెట్ల ధర రూ.92,960గా ఉంది. విజయవాడ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,410; 22 క్యారెట్ల ధర రూ.92,960. బెంగళూరు: ఇక్కడ కూడా ధరలు ముంబై స్థాయిలోనే ఉన్నాయి — 24 క్యారెట్ల ధర రూ.1,01,410; 22 క్యారెట్ల ధర రూ.92,960. కేరళ: 24 క్యారెట్ల ధర రూ.1,01,410గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.92,960గా ఉంది.
వివరాలు
ప్రాంతాలవారీగా బంగారం ధరలను పరిశీలిస్తే:
కోల్‌కతా: ఇదే తరహాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,410; 22 క్యారెట్ల ధర రూ.92,960గా కొనసాగుతోంది. ఇక వెండి ధరను పరిశీలిస్తే, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,12,900 వద్ద స్థిరంగా ఉంది.