LOADING...
Gold Price Today: Gold Price: తగ్గేదేలే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు
పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

Gold Price Today: Gold Price: తగ్గేదేలే.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటున్నాయి. ఒకరోజు కొద్దిగా తగ్గితే, మరుసటి రోజు దూసుకుపోతూ రెండింతలు, మూడింతలవుతుంటున్నాయి. కొన్ని నెలల క్రితం రూ.90 వేల వరకు ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల మార్క్‌ను దాటి పోయింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతం ఎగబాకుతోంది. తాజాగా ఆగస్టు 6వ తేదీన బంగారం ధర మరింతగా పెరిగింది. మంగళవారం ధరలతో పోలిస్తే బుధవారం తులం బంగారంపై రూ.900 వరకు పెరిగింది. గత రెండు రోజుల ధరలను పరిశీలిస్తే తులానికి రూ.1500 వరకు పెరిగినట్లు కనిపిస్తోంది. అంటే, మూడు రోజుల వ్యవధిలో తులం బంగారంపై రూ.3000లకు పైగా పెరిగినట్లే.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి: 

ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు భారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,02,230గా ఉండగా,అదే 22క్యారెట్ల బంగారం ధర రూ.93,710గా ఉంది. ఇక 18క్యారెట్ల బంగారం ధర రూ.76,680 వద్ద కొనసాగుతోంది. ఇవి ఉదయం 6గంటలకు నమోదైన ధరలు మాత్రమే. ఇవి రోజులో మారొచ్చు - కొంత పెరగొచ్చు, తగ్గొచ్చు, లేకపోతే స్థిరంగా కొనసాగవచ్చు. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,380, 22క్యారెట్ల ధర రూ.93,860 హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ.1,02,230, 22క్యారెట్ల ధర రూ.93,710 విజయవాడ: 24 క్యారెట్ల ధర రూ.1,02,230, 22 క్యారెట్ల ధర రూ.93,710 ముంబై: 24 క్యారెట్ల ధర రూ.1,02,230, 22 క్యారెట్ల ధర రూ.93,710

వివరాలు 

అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ధరలు 

చెన్నై: 24క్యారెట్ల ధర రూ.1,02,230, 22 క్యారెట్ల ధర రూ.93,710 బెంగళూరు: 24క్యారెట్ల ధర రూ.1,02,230, 22 క్యారెట్ల ధర రూ.93,710 ఇక వెండి ధర విషయానికి వస్తే,నిన్నటి ధరతో పోల్చితే కిలో వెండి ధర రూ.2000 వరకూ పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,15,000గా ఉంది. బంగారం ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరడంతో బంగారు ఆభరణాల ధరలు కూడా తీవ్రంగా పెరిగిపోయాయి. ఇప్పుడైతే 10గ్రాముల గోల్డ్ చైన్ కొనాలంటే కనీసం రూ.1లక్ష ఖర్చు అవుతోంది. ఈ ధరలు భవిష్యత్తులో ఎలా మారతాయో అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ధరల్లో జీఎస్టీ,మేకింగ్ ఛార్జీలు లెక్కలో లేవు. ఇవన్నీ కలిపితే ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది.