
Gold Rates: అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్, భారత్‌లో పండుగల సీజన్ ప్రభావం వలన బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకుతున్నాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తగ్గింపు వస్తుందంటూ అంచనాలు, చైనా ఆర్థిక క్షీణత కారణంగా ఇన్వెస్టర్లు భద్రమైన పెట్టుబడిగా బంగారాన్ని ఇష్టపడుతున్నారు. ఫలితంగా, అంతర్జాతీయంగా ఒక ఔన్స్ బంగారం ధర 4,200 డాలర్ల వద్ద స్థిరపడింది.
వివరాలు
నిన్నటితో పోలిస్తే నేడు ధరలు మరింత..
భారత్‌లోనూ ధన్‌తేరస్, దీపావళి పండుగల సందర్భంగా గత కొన్ని రోజులుగా బంగారం,వెండి ధరల్లో ర్యాలీ కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు ధరలు మరింత ఎగబాకాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, గురువారం ఉదయం 6:30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,660కు పెరిగి, 18 క్యారెట్ బంగారం ధర రూ.97,090కి చేరింది. వెండి ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతంలో కిలో వెండి ధర రూ.1,90,100గా ఉంది. కాగా, 10 గ్రాముల ప్లాటినం ధర స్వల్పంగా తగ్గి రూ.46,810గా నమోదైంది.
వివరాలు
వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే,18కే) ఇవీ
చెన్నై: ₹1,29,390; ₹1,18,610; ₹97,010 ముంబై: ₹1,29,450; ₹1,18,660; ₹97,090 ఢిల్లీ: ₹1,29,600; ₹1,18,810; ₹97,240 కోల్‌కతా: ₹1,29,450; ₹1,18,660; ₹97,090 బెంగళూరు: ₹1,29,450; ₹1,18,660; ₹97,090 హైదరాబాద్: ₹1,29,450; ₹1,18,660; ₹97,090 కేరళ: ₹1,29,450; ₹1,18,660; ₹97,090 పూణె: ₹1,29,450; ₹1,18,660; ₹97,090 వడోదరా: ₹1,29,500; ₹1,18,710; ₹97,140 అహ్మదాబాద్: ₹1,29,500; ₹1,18,710; ₹97,140
వివరాలు
వెండి ధరలు ఇలా
చెన్నై: ₹2,07,100 ముంబై: ₹1,90,100 ఢిల్లీ: ₹1,90,100 కోల్‌కతా: ₹1,90,100 బెంగళూరు: ₹1,95,100 హైదరాబాద్: ₹2,07,100 కేరళ: ₹2,07,100 పూణె: ₹1,90,100 వడోదరా: ₹1,90,100 అహ్మదాబాద్: ₹1,90,100 గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.