LOADING...
Gold Rate: అంతకంతకూ పెరుగుతున్న బంగారం.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
అంతకంతకూ పెరుగుతున్న బంగారం.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

Gold Rate: అంతకంతకూ పెరుగుతున్న బంగారం.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరల ర్యాలీ కొనసాగుతుంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం,ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తగ్గింపు రావచ్చని అంచనాలు,అలాగే డాలరు బలహీన పడుతున్నడాలరు విలువ కలగలిసి బంగారానికి డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మాత్రమే కాక, దేశీయంగా కూడా బంగారం జీవితకాల గరిష్టాలను సాధిస్తోంది. భారతదేశంలో పండుగ సీజన్ కాబట్టి,గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న రీతిని నేడు కూడా కొనసాగిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, శుక్రవారం ఉదయం 6:30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430కు చేరి కొత్త జీవితకాల రికార్డు స్థాయిని సాధించింది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,18,640కు, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.97,070కు పెరిగింది.

వివరాలు 

రికార్డు స్థాయిలో వెండి ధర

వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,88,900గా నమోదైంది. 10 గ్రాముల ప్లాటినం ధర కూడా నిన్నటి తో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.46,850కు చేరింది. అంతర్జాతీయంగా, ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4300 డాలర్ల మార్కును దాటింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయంలో, ధన్‌తేరస్ తరువాత దేశంలో బంగారం ధరల్లో కొంత స్వల్ప కరెక్షన్ ఉండవచ్చని సూచిస్తున్నారు.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే) 

చెన్నై: ₹1,29,830; ₹1,19,010; ₹98,310 ముంబై: ₹1,29,430; ₹1,18,640; ₹97,070 ఢిల్లీ: ₹1,29,580; ₹1,18,790; ₹97,220 కోల్‌కతా: ₹1,29,430; ₹1,18,640; ₹97,070 బెంగళూరు: ₹1,29,430; ₹1,18,640; ₹97,070 హైదరాబాద్: ₹1,29,430; ₹1,18,640; ₹97,070 కేరళ: ₹1,29,430; ₹1,18,640; ₹97,070 పూణె: ₹1,29,430; ₹1,18,640; ₹97,070 వడోదరా: ₹1,29,480; ₹1,18,690; ₹97,120 అహ్మదాబాద్: ₹1,29,480; ₹1,18,690; ₹97,120

వివరాలు 

వెండి ధరలు ఇవీ 

చెన్నై: ₹2,05,900 ముంబై: ₹1,88,900 ఢిల్లీ: ₹1,88,900 కోల్‌కతా: ₹1,88,900 బెంగళూరు: ₹1,93,900 హైదరాబాద్: ₹2,05,900 కేరళ: ₹2,05,900 పూణె: ₹1,88,900 వడోదరా: ₹1,88,900 అహ్మదాబాద్: ₹1,88,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.