LOADING...
Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..

Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. అయితే,గత నాలుగు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండటంతో,చాలా మంది కొనుగోలుకు ముందుకు వచ్చారు. కానీ, వారందరికీ ఊహించని షాక్ తగిలింది. తాజాగా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా లక్ష రూపాయలు దాటాయి. ఆ తర్వాత కొంతకాలం తగ్గినా, మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇటీవల 95 వేల రూపాయల వరకు దిగిపోయిన బంగారం, ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 99 వేల మార్కును అధిగమించింది.

వివరాలు 

ప్రముఖ నగరాల్లో తాజా ధరల పరిస్థితి ఇలా ఉంది: 

ఈ నేపథ్యంలో జూన్ 5, 2025 గురువారం ఉదయం వరకు పలు ప్రముఖ వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,180గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.90,910గా ఉంది. బంగారం ధరలో రూ.10 పెరుగుదల నమోదైంది. వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.1,02,100గా ఉంది. హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,180 22 క్యారెట్ల ధర - రూ.90,910 వెండి ధర (కిలో) - రూ.1,13,100 విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,180 22 క్యారెట్ల ధర - రూ.90,910 వెండి ధర (కిలో) - రూ.1,13,100

వివరాలు 

ప్రముఖ నగరాల్లో తాజా ధరల పరిస్థితి ఇలా ఉంది: 

ఢిల్లీ: 24 క్యారెట్ల పసిడి ధర - రూ.99,330 22 క్యారెట్ల ధర - రూ.91,060 వెండి ధర (కిలో) - రూ.1,02,100 ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,180 22 క్యారెట్ల ధర - రూ.90,910 వెండి ధర (కిలో) - రూ.1,02,100 చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,180 22 క్యారెట్ల ధర - రూ.90,910 వెండి ధర (కిలో) - రూ.1,13,100 బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,180 22 క్యారెట్ల ధర - రూ.90,910 వెండి ధర (కిలో) - రూ.1,02,100

Advertisement