Gold Rates: గోల్డ్ లవర్స్ కి షాక్.. పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గినట్టు కనిపించిన ధరలు మళ్లీ పెరగడం ఆశ్చర్యానికి గురిచేశాయి. కార్తీక మాసం కారణంగా ధరలు కొంత తగ్గుతాయనే అంచనాలు ఉండగా, వీటి విరుద్ధంగా బంగారం రేట్లు పెరగడంతో మహిళలు సహా కొనుగోలుదారులకు నిరాశ కలిగింది. గురువారం తులం బంగారంపై రూ.430 వరకూ పెరుగుదల నమోదైంది. అదే సమయంలో వెండిపై కూడా కిలోకు రూ.1,000 మేర పెరుగుదల చోటుచేసుకుంది.
వివరాలు
బులియన్ మార్కెట్ తాజా రేట్ల ప్రకారం:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,21,910 వద్ద లభిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరిగి రూ.1,11,750 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి రూ.91,430 వద్ద విక్రయించబడుతోంది. పెరిగిన వెండి ధరలు బుల్లియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,51,500 గా నమోదైంది. అయితే హైదరాబాద్‌లో వెండి కిలో ధర మరింతగా రూ.1,64,000 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో మాత్రం వెండి కిలో ధర రూ.1,51,500 వద్దే ట్రేడవుతోంది.