
Gold and Silver Rates Today: పసిడి కొనాలనుకునే వారికి షాక్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అంతర్జాతీయ రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు దృష్టి పెట్టడంతో బంగారం డిమాండ్‌లో తేడాగా పెరుగుదల కనిపిస్తోంది. అలాగే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,850 రూపాయలకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,19,940 రూపాయలకు నమోదు అయ్యింది.
వివరాలు
స్థిరంగా వెండి ధర
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,31,000 రూపాయలకు చేరగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,20,090 రూపాయలు దాటింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,850 రూపాయలకు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,19,940 రూపాయలకు నమోదయింది. వెండి ధరల్లో నిన్నటితో పోలిస్తే మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో, దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 విజయవాడలో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 ఢిల్లీలో రూ. 1,31, 000, రూ. 1, 20, 090 ముంబైలో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 వడోదరలో రూ. 1,30, 900, రూ. 1, 19, 990 కోల్‌కతాలో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 చెన్నైలో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 బెంగళూరులో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 కేరళలో రూ. 1,30, 850, రూ. 1, 19, 940 పుణెలో రూ. 1,30, 850, రూ. 1, 19, 940
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 89, 900 విజయవాడలో రూ. 1, 89, 900 ఢిల్లీలో రూ. 1, 71, 900 చెన్నైలో రూ. 1, 89, 900 కోల్‌కతాలో రూ. 1, 71, 900 కేరళలో రూ. 1, 89, 900 ముంబైలో రూ. 1, 71, 900 బెంగళూరులో రూ. 1, 79, 900 వడోదరలో రూ. 1, 71, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 71, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.