Gold and Silver Rates: పసిడి పరుగు ఆగదా?.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,20,780కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 1,10,710గా నమోదైంది.
వివరాలు
వంద రూపాయల మేర పెరిగిన వెండి ధర
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,20,930గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,10,860కి చేరింది.
ఇక హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,20,780గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,10,710గా ఉంది.
ఈ నేపథ్యంలో వెండి ధరలు కూడా పెరుగుదల దిశగా పయనించాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధరలు సుమారు వంద రూపాయల మేర పెరిగాయి.
మొత్తం గా చూస్తే, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు పెరుగుతున్న ట్రెండ్‌లోనే కొనసాగుతున్నాయి.
పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలు దారులు తాజా బంగారం, వెండి ధరల వివరాలను పరిశీలిస్తూ తమ కొనుగోళ్లను నిర్ణయిస్తున్నారు. (Gold Market Updates)
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,20,780, రూ.1,10,710
విజయవాడలో రూ.1, 20,780, రూ. 1,10,710
ఢిల్లీలో రూ. 1, 20, 930, రూ. 1, 10, 860
ముంబైలో రూ. 1, 20, 780, రూ. 1, 10, 710
వడోదరలో రూ. 1, 20, 830, రూ. 1, 10, 760
కోల్‌కతాలో రూ. 1, 20, 780, రూ. 1, 10, 710
చెన్నైలో రూ. 1, 20, 780, రూ. 1, 10, 710
బెంగళూరులో రూ. 1, 20, 780, రూ. 1, 10, 710
కేరళలో రూ. 1, 20, 780, రూ. 1, 10, 710
పుణెలో రూ. 1, 20, 780, రూ. 1, 10, 710
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 67, 100
విజయవాడలో రూ. 1, 67, 100
ఢిల్లీలో రూ. 1, 56, 100
చెన్నైలో రూ. 1, 67, 100
కోల్‌కతాలో రూ. 1, 56, 100
కేరళలో రూ. 1, 67, 100
ముంబైలో రూ. 1, 56, 100
బెంగళూరులో రూ. 1, 56, 100
వడోదరలో రూ. 1, 56, 100
అహ్మదాబాద్‌లో రూ. 1, 56, 100
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన. పైన పేర్కొన్న ధరలు నిన్నటి మార్కెట్ రేట్ ప్రకారమే ఇవ్వడమైనది.