
Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ బంగారం మార్కెట్‌లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు "సురక్షిత ఆస్తులు" వైపుకు ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రభావం బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతుంది. అంతే కాకుండా, అమెరికన్ డాలర్‌కి పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల్లో, అక్టోబర్ 8న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,23,940కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,13,610ని దాటింది.
వివరాలు
వంద రూపాయిల మేర పెరిగిన వెండి
ఢిల్లీలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,24,090కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ₹1,13,760 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,23,940గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ₹1,13,610కు చేరింది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయిల మేర పెరిగాయి ఇలా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలలో పెరుగుదల కొనసాగుతూ ఉంది. పెట్టుబడిదారులు మరియు గోల్డ్ మార్కెట్ విశ్లేషకులు ఈ ధరణి గమనిస్తూ భవిష్యత్తులో మరిన్ని మార్పులు చోటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1, 23, 940, రూ. 1, 13, 610 విజయవాడలో రూ.1, 23, 940, రూ. 1, 13, 610 ఢిల్లీలో రూ. 1,24, 090, రూ. 1, 13, 760 ముంబైలో రూ.1, 23, 940, రూ. 1, 13, 610 వడోదరలో రూ. 1, 23, 990, రూ. 1, 13, 660 కోల్‌కతాలో రూ. 1, 23, 940, రూ. 1, 13, 610 చెన్నైలో రూ.1, 23, 940, రూ. 1, 13, 610 బెంగళూరులో రూ.1, 23, 940, రూ. 1, 13, 610 కేరళలో రూ.1,23, 940, రూ. 1, 13, 610 పుణెలో రూ.1,23, 940, రూ. 1, 13, 610
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 70, 010 విజయవాడలో రూ. 1, 70, 010 ఢిల్లీలో రూ. 1, 60, 010 చెన్నైలో రూ. 1, 70, 010 కోల్‌కతాలో రూ. 1, 60, 010 కేరళలో రూ. 1, 70, 010 ముంబైలో రూ. 1, 60, 010 బెంగళూరులో రూ. 1, 60, 010 వడోదరలో రూ. 1, 60, 010 అహ్మదాబాద్‌లో రూ. 1, 60, 010 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.