LOADING...
Gold Rate: ఒక్క రోజులోనే పసిడి ధర అల్ టైం రికార్డు.. రూ.2లక్షలు దాటేసిన వెండి!
ఒక్క రోజులోనే పసిడి ధర అల్ టైం రికార్డు.. రూ.2లక్షలు దాటేసిన వెండి!

Gold Rate: ఒక్క రోజులోనే పసిడి ధర అల్ టైం రికార్డు.. రూ.2లక్షలు దాటేసిన వెండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

2025లో బంగారం ధరలు ఎప్పుడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజు ఒక్కో మార్పు వందల్లో తగ్గినా, వెంటనే వేలల్లోకి తిరిగి ఎగిసిపోతున్నాయి. సాధారణ మధ్యతరగతి ప్రజలు కనీసం గోల్డ్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదలతో పాటు, దేశీయంగా జ్యువెలర్లు, రిటైలర్లు నుండి డిమాండ్‌ కూడా పెరగడం ప్రధాన కారణం అని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ధనాధికుల పండగ, ధన్తేరాస్‌కి ఒక్కరోజు ముందు పసిడి ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. బంగారం ధరల భారీ పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Details

 ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24, 22, 18 క్యారెట్లు - 10 గ్రాముల మోతాదు) 

దిల్లీ: 24కే. రూ.1,32,930 | 22కే. రూ.1,21,860 | 18కే. రూ.97,210 హైదరాబాద్: 24కే. రూ.1,29,450 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590 విజయవాడ:24కే. రూ.1,29,450 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590 విశాఖపట్నం: 24కే. రూ.1,29,450 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590 ముంబై: 24కే. రూ.1,32,780 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590 పూణే: 24కే. రూ.1,32,780 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590 కోల్‌కతా: 24కే. రూ.1,32,780 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590 చెన్నై: 24కే. రూ.1,33,100 | 22కే. రూ.1,22,010 | 18కే. రూ.1,01,010 బెంగళూరు: 24కే. రూ.1,32,780 | 22కే. రూ.1,21,710 | 18కే. రూ.99,590

 Details

వెండి ధరలు 

దేశంలో బంగారం ధరల పెరుగుదలతో పాటుగా వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు వెండి ధర ప్రతి గ్రాము రూ.202.90, కిలోగా రూ.2,02,900 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో, పసిడి-వెండి మార్కెట్లు సాధారణ వినియోగదారుల కోసం తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.