Page Loader
Gold Rate Today:జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న బంగారం ధర .. ఒక్కరోజులోనే తులం రూ. 2,900 పెరిగిన పసిడి
జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న బంగారం ధర

Gold Rate Today:జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న బంగారం ధర .. ఒక్కరోజులోనే తులం రూ. 2,900 పెరిగిన పసిడి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు,పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడం మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడిన పసిడి ధరలు ప్రస్తుతం ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఒక్కరోజులోనే 22క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ.270పెరగగా, 24 క్యారెట్ల ధర రూ.294 మేర పెరిగింది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.85,600 వద్ద ట్రేడవుతుండగా, 24 క్యారెట్ల బంగారం అదే పరిమాణానికి రూ.93,380 కి చేరుకుంది. వినియోగదారులు ఈ ధరల పెరుగుదలతో గందరగోళంలో పడుతున్నారు.

వివరాలు 

నగరాల వారీగా బంగారం ధరలు 

హైదరాబాద్ & విజయవాడ: హైదరాబాద్‌లో బంగారం ధరలు బాగా పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,380 కాగా, 22 క్యారెట్ల ధర రూ.85,660 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు లాంటి నగరాల్లో సైతం ఇలాంటి ధరలే నమోదు అయ్యాయి. చెన్నై, బెంగళూరు, గోవా: చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.9,338 కాగా, 22 క్యారెట్ల ధర రూ.8,560 గా ఉంది. గోవాలోనూ ఇదే రీతిలో ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి రూ.9,330, 22 క్యారెట్ల రూ.8,560 వద్ద ఉంది.

వివరాలు 

నగరాల వారీగా బంగారం ధరలు 

ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,353 కాగా, 22 క్యారెట్ల ధర రూ.8,575. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,338, 22 క్యారెట్ల ధర రూ.8,560. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.9,343, 22 క్యారెట్ల ధర రూ.8,565 వద్ద ఉంది. అయోధ్య, భువనేశ్వర్: రామాలయ నిర్మాణం పూర్తి నేపథ్యంలో ఆధ్యాత్మికతతో నిండి ఉన్న అయోధ్యలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్ల ధర రూ.9,353, 22 క్యారెట్ల ధర రూ.8,575 వద్ద ఉంది. భువనేశ్వర్‌లో అదే వరుస కొనసాగుతోంది.

వివరాలు 

వెండి ధరలు కూడా పెరిగిపోయాయి 

బంగారం మాత్రమే కాదు, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,04,000కి చేరింది. గ్రాము వెండి ధర నిన్నటి కంటే రూ.2 పెరిగింది. అంటే కిలో వెండి రూ.2,000 మేర పెరిగినట్లయింది. ముంబైలో వెండి ధర రూ.95,000 వద్ద కొనసాగుతోంది. వెండి ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మరింత భారంగా మారింది.

వివరాలు 

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? 

నిపుణుల మాటల ప్రకారం బంగారం, వెండి ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై తీసుకున్న నిర్ణయాలను 90 రోజులు వాయిదా వేయడం, డాలర్ మారక విలువ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత కారణంగా మదుపరులు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే కారణంగా డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక దేశీయంగా పెళ్లిళ్ల సీజన్, పండుగలు సమీపిస్తున్న నేపథ్యంతో బంగారం కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు తోడ్పడింది.

వివరాలు 

సామాన్యుడికి మరింత భారం!  

ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి, పేద ప్రజలకు పెద్ద భారం అయ్యింది. గతంలో బంగారం కొనాలనుకున్న వారు ఇప్పుడు ధరల వల్ల వెనక్కి తగ్గుతున్నారు. ''బంగారం కొనడం కలగానే మిగిలిపోతుందా?'' అనే ఆందోళన సామాన్య ప్రజల మధ్య వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల కొనుగోలుదారులు నిరీక్షణలోకి వెళుతున్నారు.