LOADING...
Gold and Silver Rates: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే?
బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే?

Gold and Silver Rates: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఎంత పెరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పసిడి కొనాలనుకునే వారికి ఈరోజు బంగారం,వెండి ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి ధరలు తగ్గుతూ రావడంతో కొనుగోలుదారులు కొంత ఊరట పొందారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో ధరలు పడిపోవడం వల్ల మగువలు, సామాన్యులకు ఇది మంచి అవకాశం అయింది. అయితే ధరలు ఇంకా తగ్గుతాయని భావిస్తున్న సమయంలోనే మార్కెట్ మళ్లీ మలుపు తిరిగింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తులం బంగారం ధరపై ఏకంగా రూ.1,970 పెరుగుదల నమోదవగా, కిలో వెండి ధరపై రూ.5,000 పెరిగింది.

వివరాలు 

వెండి ధరలు

ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,850కు చేరింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగి రూ.1,13,610 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా భారీగా ఎగబాకాయి. బుధవారం ఒక్కరోజులోనే కిలో వెండిపై రూ.5,000 పెరుగుదల నమోదైంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.

వివరాలు 

సందిగ్ధంలో కొనుగోలుదారులు

హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద ట్రేడ్ అవుతుండగా, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,55,000గా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే, తగ్గుతాయని భావించిన సమయంలోనే బంగారం, వెండి ధరలు పెరగడం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది. దీంతో ఇప్పుడు కొనాలా? లేక వేచి చూడాలా? అనే సందిగ్ధంలో కొనుగోలుదారులు ఉన్నారు.

Advertisement