Gold Price: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. భారత్‌లో ఎంత తగ్గిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ శుభవార్త వచ్చింది. ఇటీవల భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు గణనీయంగా పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూలేని రీతిలో రికార్డులు సృష్టించగా, ఇప్పుడు ఆ పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం సాయంత్రం బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. అమెరికన్ డాలర్ బలపడడం, యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపించడం బంగారంపై ఒత్తిడిని సృష్టించాయి. దాంతో అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 115 డాలర్లకు పైగా తగ్గి 3,994 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే దేశీయంగా పరిస్థితి కొంత భిన్నంగా ఉంది.
Details
పది రోజులుగా తగ్గుదల
డాలర్ విలువ 36 పైసలు పెరగడంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర అంతగా తగ్గలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,24,400 వద్ద ఉండగా, కిలో వెండి ధర రూ.1,48,200 వద్ద ట్రేడవుతోంది. పది రోజుల్లో భారత్‌లో బంగారం ధరలు క్రమంగా పడిపోయాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.9,000 తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉద్రిక్తతలు తగ్గడంతో ఈ పతనం కొనసాగుతోంది. వెండి ధరలూ క్రమంగా తగ్గుతున్నాయి. పది రోజుల్లో కిలో వెండిపై రూ.30,000కు పైగా తగ్గుదల వచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1.50 లక్షలకు దిగువకు చేరింది.
Details
ధరల పతనానికి దారితీసిన ప్రధాన కారణాలు ఇవి
1. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంగా రష్యా ఆయిల్ కంపెనీలు *లూకోయిల్, రోస్‌నెఫ్ట్*లపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం. 2. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్క లవబోతున్నారన్న వార్త మార్కెట్‌లో సానుకూల ప్రభావం చూపింది. 3. అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) నివేదిక పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం ఈ నివేదికపైనే కేంద్రీకృతమై ఉంది. సెప్టెంబర్ నెల కోర్ ఇన్‌ఫ్లేషన్ 3.1 శాతం వద్ద స్థిరంగా ఉండొచ్చని అంచనా. మొత్తం మీద, అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ అంచనాలు కలిసి బంగారం-వెండి ధరలను గణనీయంగా తగ్గించాయి. కొనుగోలు దారులకు ఇది ఒక బంగారు అవకాశంగా మారింది.