Gold and Silver Rate Today: బంగారం,వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్.. భారీగా పతనం..ఇప్పుడు తులం ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరల పెరుగుదలకు ఆకస్మికంగా అడ్డుకట్ట పడింది. వరుసగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనుకూల సమయంగా మారింది. సోమవారం నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు శుక్రవారం ఒక్కరోజులోనే మారిపోవడం గమనార్హం. గంటల వ్యవధిలోనే ధరలు క్షీణించడంతో మార్కెట్‌లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,54,200 వద్ద ఉంది. ఉదయం రూ.1,55,570గా ఉన్న ధర ఒక్కసారిగా రూ.1,370 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది. ఉదయం రూ.1,42,600గా ఉన్న ఈ ధరపై రూ.1,250 తగ్గుదల నమోదైంది.
వివరాలు
ఇతర నగరాలలో బంగారం ధరలు ఇలా..
చెన్నైలో మరింత భారీగా తగ్గుదల కనిపించింది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర ఉదయం రూ.1,56,660గా ఉండగా ప్రస్తుతం రూ.1,55,020కి పడిపోయింది. అంటే రూ.1,640 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,43,600 నుంచి రూ.1,42,100కి చేరింది. అంటే రూ.1,500 మేర తగ్గింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,350గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,350గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,500 వద్ద ఉంది.
వివరాలు
వెండి ధరలు
వెండి ధరల్లో కూడా గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.65 లక్షలుగా ఉంది. ఉదయం ఇది రూ.2.70 లక్షలుగా ఉండగా ఒక్కసారిగా రూ.5,000 తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.75 లక్షలుగా ఉండగా, చెన్నైలో కూడా ఇదే స్థాయిలో కొనసాగుతోంది.