Gold prices: నేడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్న బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా అంచనాలకు మించిన బంగారం ధరలు నేడు (జనవరి 30) అనూహ్యంగా క్షీణించాయి. ట్రేడింగ్ ప్రారంభం అయ్యే కొద్దిరోజుల్లోనే బంగారం,వెండి ధరల్లో పెద్ద తగ్గింపు నమోదయింది. దేశవ్యాప్తంగా మేలిమి బంగారం ధర సుమారుగా రూ.8,000, వెండి ధర సుమారుగా రూ.15,000 మేర తగ్గింది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ధర ఒక్కసారిగా తగ్గిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620కి చేరింది. అలాగే, 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.7,550 తగ్గి రూ.1,56,400కి చేరింది.
వివరాలు
బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు
వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.4,15,000కి రికార్డ్ అయింది, ఇది నిన్నటి రేటుతో పోలిస్తే సుమారుగా రూ.10,000 తక్కువ. ఇటీవల బంగారం ధరల్లో భారీ పెరుగుదల కారణంగా సాధారణ ప్రజలు బంగారం కొనుగోలుకు ముందుకొచ్చారు. అనేక మంది జువెలరీ షాపులకు క్యూకట్టారు. కొందరు అప్పులు తీసుకుని కూడా బంగారం కొనుగోలు చేసారు. ఈ నేపథ్యంలో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 70 శాతం మేర పెరిగాయి. భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరుగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.