LOADING...
Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
మళ్లీ పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో రోజురోజుకూ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒకరోజు పెరుగుతుండగా మరోరోజు తగ్గుతూ ఉండటంతో సాధారణ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధర మాత్రం స్థిరంగా ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఈరోజు బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. తులం బంగారం ధరపై రూ.490 పెరగడంతో, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,840కు చేరింది.

వివరాలు

వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,40,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.370 పెరిగి రూ.1,14,630కు చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే ఈరోజు ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర బులియన్ మార్కెట్‌లో రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000గా ఉంది. మరోవైపు దిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,60,000 వద్దనే ట్రేడ్ అవుతోంది.

Advertisement