LOADING...
Gold and Silver: స్థిరంగా బంగారం,వెండి ధరలు .. కొనుగోలుదారులకు ఊరట
స్థిరంగా బంగారం,వెండి ధరలు .. కొనుగోలుదారులకు ఊరట

Gold and Silver: స్థిరంగా బంగారం,వెండి ధరలు .. కొనుగోలుదారులకు ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా సాగిన బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట కలిగింది. అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, పసిడిపై డిమాండ్ మాత్రం తగ్గకుండా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,38,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,230గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,500గా నమోదైంది.

వివరాలు 

వెండి ధరలు

ఇక వెండి ధరలు కూడా ఇదే విధంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.65 లక్షలుగా నమోదు కాగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.2.7 లక్షలు, బెంగళూరులో రూ.2.65 లక్షలుగా ఉంది. గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి తరచూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

Advertisement