LOADING...
Gold Rates: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Rates: దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం రికార్డు స్థాయిలను తాకిన మేలిమి బంగారం ధర ప్రస్తుతం రూ.1.25 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రోజువారీ ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే నమోదవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ తాజా వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,25,610కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్‌ ఆభరణాల బంగారం ధర రూ.1,15,140గా, 18 క్యారెట్‌ బంగారం ధర రూ.94,210గా నమోదైంది. వెండి ధర కూడా ప్రస్తుతం కిలోకు రూ.1,54,900గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర రూ.1,25,610గా, కిలో వెండి ధర రూ.1,69,900గా నమోదైంది.

Details

ఈవారం తగ్గే అవకాశం

నిపుణుల అంచనా ప్రకారం, ఈ వారం పసిడి, వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. రేపు ప్రారంభమయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశాల్లో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కీలకమవనుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా ఉందని తాజా ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి.

Details

నగరాల వారీగా బంగారం ధరలు (10 గ్రాములు)

24 క్యారెట్ - 22 క్యారెట్ - 18 క్యారెట్‌ ధరలు చెన్నై: ₹1,25,440; ₹1,14,990; ₹96,240 ముంబై: ₹1,25,610; ₹1,15,140; ₹94,210 ఢిల్లీ: ₹1,25,760; ₹1,15,290; ₹94,360 కోల్‌కతా: ₹1,25,610; ₹1,15,140; ₹94,210 బెంగళూరు: ₹1,25,610; ₹1,15,140; ₹94,210 హైదరాబాద్: ₹1,25,610; ₹1,15,140; ₹94,210 కేరళ: ₹1,25,610; ₹1,15,140; ₹94,210 పూణె: ₹1,25,610; ₹1,15,140; ₹94,210 వడోదరా: ₹1,25,660; ₹1,15,140; ₹94,260 అహ్మదాబాద్: ₹1,25,660; ₹1,15,140; ₹94,260

Details

వెండి ధరలు (కిలో)

చెన్నై: ₹1,69,900 ముంబై: ₹1,54,900 ఢిల్లీ: ₹1,54,900 కోల్‌కతా: ₹1,54,900 బెంగళూరు: ₹1,56,900 హైదరాబాద్: ₹1,69,900 కేరళ: ₹1,69,900 పూణె: ₹1,54,900 వడోదరా: ₹1,54,900 అహ్మదాబాద్: ₹1,54,900 మొత్తానికి, బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, గ్లోబల్‌ మార్కెట్‌ ధోరణులు రాబోయే రోజుల్లో పసిడి రేట్ల దిశను నిర్ణయించనున్నాయి.