బంగారంపై ఇజ్రాయెల్-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా
ఇజ్రాయెల్ - హమాస్ అనూహ్య యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్ మార్కెట్‌లోనూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. ఓవైపు యుద్ధంతో ఇజ్రాయెల్ ప్రజలు భీతిలిపోతున్నారు. మరోవైపు పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. మరోవైపు భారత్ ఎక్కువగా బంగారం దిగుమతులపైనే ఆధారపడుతోంది. వార్ కారణంగా గోల్డ్ రవాణాలో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో బంగారం సమయానికి అందుబాటులోకి రాక ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం శుభ కార్యక్రమాలు జేరుగుతుండటం, దేవిశరన్నవరాత్రులు, దసరా, లక్ష్మిపూజ, దీపావళి లాంటి పెద్ద పండగల సీజన్ ఆరంభమవుతోంది. ప్రస్తుతం శుభ కార్యక్రమాలు జరుగుతుండటం, దేవిశరన్నవరాత్రులు, దసరా, దీపావళి, లక్ష్మీపూజ లాంటి పెద్ద పండగల సీజన్ ఆరంభమవుతోంది. ఈ సందర్బంగా బంగారం కొనుగోళ్లు ఊపందుకుని ధరలు భారీగా పెరగాల్సి ఉంది.
యుద్ధం తీవ్రమైతే మరింత పెరగనున్న బంగారం ధరలు
కానీ గత నెల నుంచి పసిడి ధర తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థితిగతులు, స్థానికంగా కొనుగోళ్ల తగ్గుదల తదితర కారణాలతో నెల రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. దీంతో కొనుగోలుదార్లలో ఆశలు నిలిచాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యాక ఏపీలోని ఉమ్మడి తూగో జిల్లాలో బంగారం,వెండి ధరలకు రెక్కలొచ్చాయి. గత శనివారం మధ్యాహ్నం వరకు గ్రాము ధర పన్నులతో కలిపి రూ.5,770 వరకు ఉండగా, యుద్ధంతో సోమవారం మధ్యాహ్నం రూ.5,914కు చేరుకుంది. మంగళవారం గ్రాముపై మరో రూ.14 పెరగడంతో రూ.5,928కి ఎగబాకింది.4 రోజుల్లో గ్రాముకు రూ.158 పెరగడం గమనార్హం. కేజీ వెండి ధర శనివారం రూ.68,300 ఉండగా, మంగళవారం రూ.71,660కు దూసుకెళ్లింది.యుద్ధం తీవ్రమైతే ధరలు పెరిగే అవకాశముందని అంచనా.