LOADING...
Gold Prices: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. మంగళవారం ఒక్కసారిగా భారీగా పెరుగుదల.. తాజా రేట్లు ఇవే..
తాజా రేట్లు ఇవే..

Gold Prices: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. మంగళవారం ఒక్కసారిగా భారీగా పెరుగుదల.. తాజా రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి, మంగళవారం గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు, బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ అనిశ్చితి కారణంగా పసిడి, వెండి ధరల్లో తరచూ మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఎప్పుడు ధరలు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో అర్థంకాక సందిగ్ధంలో పడుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,53,930కు చేరింది. సోమవారం ఇది రూ.1,52,460గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.1,470 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,100గా ఉండగా, నిన్నటి రూ.1,39,750తో పోలిస్తే రూ.1,350 పెరిగినట్లు స్పష్టమవుతోంది.

వివరాలు 

వెండి ధరలు

చెన్నైలో బంగారం ధరలు మరింత పెరుగుదల చూపించాయి. సోమవారం రూ.1,53,380గా ఉన్న 24క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.1,55,130కు చేరి రూ.1,750 పెరిగింది. 22క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,42,200గా ఉండగా,గత రోజు రూ.1,40,600తో పోలిస్తే రూ.1,600 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,080గా నమోదైంది. 22క్యారెట్ల ధర రూ.1,41,250గా కొనసాగుతోంది. బెంగళూరులో 24క్యారెట్ల బంగారం రూ.1,53,930గా ఉండగా,22క్యారెట్ల ధర రూ.1,41,100 వద్ద ఉంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో సోమవారం రూ.2.60లక్షలుగా ఉన్న వెండి ధర మంగళవారం రూ.2.65 లక్షలకు చేరింది. హైదరాబాద్‌లో కూడా వెండి ధర రూ.2.65 లక్షల వద్ద నిలిచింది.

Advertisement