LOADING...
Gold Rate: 2028లో మీ అమ్మాయి పెళ్లి చేస్తే.. అప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?
2028లో మీ అమ్మాయి పెళ్లి చేస్తే.. అప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?

Gold Rate: 2028లో మీ అమ్మాయి పెళ్లి చేస్తే.. అప్పుడు బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 4,000 డాలర్ల స్థాయికి చేరిన ఇది త్వరలోనే తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే యార్డేని రీసెర్చ్ అంచనా ప్రకారం, ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమే. 2026 చివరి నాటికి బంగారం ధరలు 5,000 డాలర్లకు చేరుతాయని, 2028 నాటికి 10,000 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని యార్డేని రీసెర్చ్ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ యార్డేని తెలిపారు. ఇది ప్రస్తుత స్థాయిలకు సమీపంగా దాదాపు 150 శాతం వృద్ధికి సమానం.

Details

చైనాపై 100శాతం అదనపు సుంకాలు

యార్డేని తన క్లయింట్ నోట్‌లో మా బుల్లిష్‌నెస్‌కు 'గోల్డ్ పుట్' మద్దతు ఇస్తుంది. సెంట్రల్ బ్యాంకులు తమ అంతర్జాతీయ బంగారు నిల్వలను పెంచుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. దీని అర్థం ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కరెన్సీ రిస్క్‌లను తగ్గించుకునేందుకు బంగారాన్ని హెడ్జ్‌గా కొనుగోలు చేస్తూనే ఉంటారని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధించడం మరింత సంక్లిష్టతను ఏర్పరిచింది.

Details

రికార్డు స్థాయిలో 52శాతం లాభం

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, యార్డేని రీసెర్చ్ బంగారం ధరలు మరింత పెరుగుతాయని, భవిష్యత్తులో పేర్కొన్న స్థాయిలకు చేరుతాయని అంచనా వేస్తోంది. ఈ నెల ప్రారంభంలోనే బంగారం ధరలు 4,000 డాలర్లకు చేరడంతో రికార్డు స్థాయిలో 52 శాతం లాభాన్ని సాధించింది. మరికొన్ని బ్రోకరేజ్‌ల అభిపాయాలు భిన్నంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ ప్రకారం, ర్యాలీ 4,000 డాలర్ల వద్ద స్థిరపడే అవకాశం ఉంది, 5,000 డాలర్ల వరకు పెరగడం సులభం కాదని పేర్కొన్నారు.