
Gold Rates: పసిడి మరో కొత్త రికార్డు.. నేడు మరో వెయ్యి జంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు బంగారం ధరల్లో మళ్లీ భారీ పెరుగుదల నమోదైంది.గత రెండు రోజుల్లో తులంకు సుమారు రూ.2,000 మేరకు పెరిగిన నేపథ్యంలో,నేటి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,140 పెరిగి రూ.97,310కి చేరుకుంది.
ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,050 పెరిగి రూ.89,200గా ట్రేడింగ్ అవుతోంది.
ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, నిన్నటి ధరతో పోలిస్తే రూ.860 పెరిగి రూ.72,990గా నమోదయ్యింది.
బంగారం ధరలు ఇలా పెరుగుతున్నప్రధాన కారణాలు గా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అలాగే అమెరికా - చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను నిపుణులు గుర్తు చేస్తున్నారు.
వివరాలు
స్ధిరంగా వెండి ధరలు
ఈ పరిస్థితుల్లో బంగారం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన పెట్టుబడి రూపంగా మారుతోంది.
అయితే, బంగారం ధరలు ఎగసిపోతున్నా, వెండి ధరలు మాత్రం స్ధిరంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఒక్క గ్రాము వెండి ధర రూ.100గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.1,000గా కొనసాగుతోంది.
అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెండి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు, ఢిల్లీ, ముంబయి, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000గా ఉండగా, చెన్నై, హైదరాబాద్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.1,10,000గా ట్రేడవుతున్నట్లు సమాచారం.