LOADING...
Gold,silver ETFs crash: గోల్డ్, సిల్వర్ ETFs‌లో భారీ పతనం.. పెట్టుబడిదారులు ఏం చేయాలి?
గోల్డ్, సిల్వర్ ETFs‌లో భారీ పతనం.. పెట్టుబడిదారులు ఏం చేయాలి?

Gold,silver ETFs crash: గోల్డ్, సిల్వర్ ETFs‌లో భారీ పతనం.. పెట్టుబడిదారులు ఏం చేయాలి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరిన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ ప్రభావం గోల్డ్, సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETFs) పై స్పష్టంగా కనిపించింది. జనవరి 22న టారిఫ్‌లపై భయాలు తగ్గడంతో గోల్డ్, సిల్వర్ ETFs భారీగా పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారుల్లో"ఇది కొనడానికి మంచి అవకాశంా?లేక ఇంకా తగ్గే వరకు ఆగాలా?" అనే చర్చ మొదలైంది. ఈ రోజు ETFs ఎందుకు పడిపోయాయంటే,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నాటోతో గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తుపై ఒక అవగాహనకు వచ్చామని,ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రావాల్సిన టారిఫ్‌లను ఇక విధించబోమని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు,గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక బలాన్ని ఉపయోగించబోనని కూడా స్పష్టం చేశారు.

వివరాలు 

ఒక్కసారిగా తగ్గిన బంగారం,వెండి

ఈ ప్రకటనలతో అమెరికా-యూరప్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్టు మార్కెట్లు భావించాయి. దీంతో సేఫ్ హావెన్‌గా భావించే బంగారం, వెండి మీద ఉన్న డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. ఫలితంగా టాటా సిల్వర్ ETF ఒక దశలో దాదాపు 21 శాతం పడిపోగా, బిర్లా సన్‌లైఫ్ గోల్డ్ ETF కూడా సుమారు 12 శాతం వరకు క్షీణించింది. తర్వాత కొంత మేర రికవరీ కనిపించినా, పెట్టుబడిదారుల్లో ఆందోళన తగ్గలేదు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, ఇది బంగారం,వెండికి సంబంధించి మౌలిక బలహీనత కంటే కూడా మార్కెట్ సెంటిమెంట్‌లో వచ్చిన మార్పు,లాభాల బుకింగ్‌కి ఎక్కువ సంబంధం ఉంది.

వివరాలు 

ఇప్పుడు పెట్టుబడిదారులు ఏం చేయాలి..

VT మార్కెట్ సీనియర్ అనలిస్ట్ జస్టిన్ ఖూ ప్రకారం,ఈ భారీ పతనం అనేది మాక్రో సెంటిమెంట్ ఒక్కసారిగా మారడమే తప్ప, ప్రెషస్ మెటల్స్ విలువ పూర్తిగా కూలిపోయినట్టు కాదు. ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్న సమయంలో పెట్టుబడిదారులు రిస్క్ రీబ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు పెట్టుబడిదారులు ఏం చేయాలి అన్నదానిపై మార్కెట్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేట్ డైరెక్టర్ తన్వీ కంచన్ మాట్లాడుతూ,కొందరు ఈ తగ్గుదలని కొనుగోలు అవకాశంగా చూస్తే, మరికొందరు ధరలు ఎక్కువగా పెరిగిపోయాయని జాగ్రత్త పడుతున్నారు అని తెలిపారు. అయితే,సోలార్ ప్యానెల్స్,ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల నుంచి వస్తున్న డిమాండ్ వల్ల బంగారం,వెండి ఫండమెంటల్స్ ఇంకా బలంగా ఉన్నాయని ఆమె చెప్పారు.

Advertisement

వివరాలు 

గోల్డ్, సిల్వర్ ETFs‌లో సిస్టమాటిక్‌గా పెట్టుబడి పెట్టడం సరైన మార్గం 

మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్ యుద్ధాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కొత్త ట్రంప్ పాలనలో వాణిజ్య విధానాలపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రెషస్ మెటల్స్ ఇంకా పోర్ట్‌ఫోలియో హెడ్జ్‌గా కీలకంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే, 2025లో ఇప్పటికే భారీగా పెరిగిన ధరల తర్వాత ఒకే సారి మొత్తం పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దశలవారీగా, కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. కన్జర్వేటివ్ పెట్టుబడిదారులకు మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు గోల్డ్, సిల్వర్ ETFs‌లో సిస్టమాటిక్‌గా పెట్టుబడి పెట్టడం సరైన మార్గమని నిపుణుల అభిప్రాయం. ఇది టైమింగ్ రిస్క్ తగ్గించడమే కాకుండా, జియోపాలిటికల్ అనిశ్చితి, ద్రవ్య విధాన మార్పుల నుంచి రక్షణనిస్తుంది.

Advertisement

వివరాలు 

రానున్నరోజుల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం 

రానున్నరోజుల్లో ఇంకా ఒడిదుడుకులు ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. లాభాల బుకింగ్, రిస్క్ ఆఫ్ వ్యూహాల నుంచి పెట్టుబడిదారులు బయటకు రావడం వల్ల ఈ సవరణ వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, దీర్ఘకాలిక డిమాండ్, ద్రవ్యోల్బణానికి రక్షణ వంటి అంశాలు కొనసాగుతున్నందున దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది అవకాశంగా మారవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Advertisement