Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
డాలర్ బలమైన స్థాయిలో కొనసాగుతుండటంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తగ్గింపు వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో పసిడి రేట్లు వరుసగా దిగజారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ ధోరణి భారతీయ బంగారం రేట్లలో కూడా ప్రతిబింబిస్తోంది. గుడ్ రిటర్న్స్ తాజా అప్‌డేట్ ప్రకారం, నేటి (బుధవారం) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,540 గా నమోదైంది. ఇది నిన్నటి కంటే సుమారు రూ.800 తక్కువ. అదే విధంగా, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,450 వద్ద ఉంది.
వివరాలు
తగ్గిన కిలో వెండి
వెండిపై కూడా ప్రభావం స్పష్టంగా కనిపించింది. కిలో వెండి దాదాపు రూ.3,200 తగ్గి రూ.1,50,900 కు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో, ఔన్స్ 24 క్యారెట్ పసిడి సుమారు 3,969 డాలర్ల వద్ద వ్యాపారం అవుతోంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.12% పెరిగి 99.99 కు చేరుకుంది. ఇది గత మూడు నెలల్లోనే అత్యధిక స్థాయి. డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ధరలు ఒత్తిడికి గురవుతున్నాయని నిపుణుల అభిప్రాయం. మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే, ఈ వారం అంతా బంగారం రేట్లలో మరిన్ని దిద్దుబాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,22,720; ₹1,12,490; ₹93,890 ముంబై: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 ఢిల్లీ: ₹1,22,500; ₹1,12,390; ₹91,980 కోల్‌కతా: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 బెంగళూరు: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 హైదరాబాద్: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 విజయవాడ: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 కేరళ: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 పూణె: ₹1,22,450; ₹1,12,240; ₹91,830 వడోదరా: ₹1,22,500; ₹1,12,290; ₹91,880 అహ్మదాబాద్: ₹1,22,500; ₹1,12,290; ₹91,880
వివరాలు
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,64,900 ముంబై: ₹1,50,900 ఢిల్లీ: ₹1,50,900 కోల్‌కతా: ₹1,50,900 బెంగళూరు: ₹1,50,900 హైదరాబాద్: ₹1,64,900 విజయవాడ: ₹1,64,900 కేరళ: ₹1,64,900 పూణె: ₹1,50,900 వడోదరా: ₹1,50,900 అహ్మదాబాద్: ₹1,50,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.