Loading...
Gold and Silver Prices Today: బాబోయ్‌ భయపెడుటున్న బంగారం...వెండి- ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే
బాబోయ్‌ భయపెడుటున్న బంగారం...వెండి- ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Prices Today: బాబోయ్‌ భయపెడుటున్న బంగారం...వెండి- ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

నిన్న బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు చేద్దామని అనుకున్నవారికి ఈరోజు మార్కెట్ మళ్లీ నిరాశ కలిగించింది. ఒక్కసారిగా పసిడి ధరలు పైకి ఎగబాకాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే MCXలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,008 పెరిగి రూ.1,37,230కు చేరింది. వెండి కూడా అదే బాటలో నడిచింది. కిలోకు రూ.1,058 పెరిగి రూ.1,79,777 వద్ద ట్రేడైంది. దీంతో నిన్నటి తగ్గుదలతో కొనుగోలు నిర్ణయం తీసుకున్నవారికి ఈరోజు ధరల పెరుగుదల ఊహించని భారంగా మారింది.

Details

MCXలో పసిడి, వెండి ధరల జోరు

మనీకంట్రోల్ వెల్లడించిన ఉదయం 9:05 గంటల లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,230గా నమోదైంది.

గత సెషన్ ముగింపు ధరతో పోలిస్తే రూ.1,008 పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.1,058 పెరిగి రూ.1,79,777కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో పాటు పెట్టుబడిదారుల కొనుగోళ్లు కూడా విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Details

హైదరాబాద్‌లోనూ పెరిగిన పసిడి ధర

ఫ్యూచర్స్ మార్కెట్ ప్రభావం హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ కనిపించింది.

ఉదయం 9:07 గంటలకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.960 పెరిగి రూ.1,37,750కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,26,270గా కొనసాగుతోంది.

అంటే పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలని చూస్తున్న కుటుంబాల బడ్జెట్‌పై ఈ పెరుగుదల నేరుగా ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.

ADVERTISEMENT

Details

వెండి ధర కూడా పైకే

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ.1,80,220కు చేరింది. అయితే ఇవి ఉదయం సమయంలో నమోదైన ధరలు మాత్రమే.

రోజంతా అంతర్జాతీయ మార్కెట్లు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, డాలర్ కదలికలు వంటి అంశాలను బట్టి ధరల్లో మార్పులు రావచ్చు.

అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఆ రోజు మార్కెట్ ధరను ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

ADVERTISEMENT