Gold Price: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
గత రెండు, మూడు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం,వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అమెరికా కేంద్ర బ్యాంకు తాజాగా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఈ మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో డాలర్ విలువ బలపడటం బంగారం ధరలపై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడంతో పాటు దేశీయ స్పాట్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు మందగించడం కూడా ధరల దిద్దుబాటుకు దోహదపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్లయింది.
వివరాలు
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు
గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 మేర తగ్గుముఖం పట్టింది.
సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,830 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,090గా ఉంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 కాగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090గా ఉంది.
ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,980గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,240 వద్ద కొనసాగుతోంది.
ముంబయి: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 కాగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090గా ఉంది.
చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
వివరాలు
వెండి ధరలు
బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090గా ఉంది.
కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,830గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,090 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గిన నేపథ్యంలో వెండి రేట్లు కూడా స్వల్పంగా దిగొచ్చాయి.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.అయితే హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,49,900గా ట్రేడవుతోంది.
దేశంలోని మిగతా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.