Loading...
Pakistan Army: ట్రంప్‌ కుమారులకు లింకున్న అమెరికా సంస్థతో పాక్‌ సైన్యం డ్రోన్‌ డీల్
ట్రంప్‌ కుమారులకు లింకున్న అమెరికా సంస్థతో పాక్‌ సైన్యం డ్రోన్‌ డీల్

Pakistan Army: ట్రంప్‌ కుమారులకు లింకున్న అమెరికా సంస్థతో పాక్‌ సైన్యం డ్రోన్‌ డీల్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారులకు ప్రస్తుతం పరోక్ష పెట్టుబడులు ఉన్న సంస్థ ద్వారా డ్రోన్ల కొనుగోలుకు పాకిస్థాన్‌ సైన్యం ముందడుగు వేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డ్రోన్ల తయారీ సంస్థ 'పవరెస్‌'తో ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU) కుదిరినట్లు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ఆయుధాల కొనుగోలుపై చర్చలు వెలకోవిచ్‌ నేతృత్వంలోని పవరెస్‌ ప్రతినిధి బృందం పాకిస్థాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ సయ్యద్‌ అసీం మునీర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆయుధాల కొనుగోలు, ఉత్పత్తికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు పాకిస్థాన్‌ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం విషయాన్ని మాత్రం ఆ ప్రకటనలో ప్రస్తావించలేదు.

వివరాలు 

డ్రోన్ల సంఖ్య, ఒప్పంద విలువ వెల్లడి కాలేదు

పాకిస్థాన్‌ సైన్యం ఎన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుందో, ఈ ఒప్పందం విలువ ఎంతనేది ఇంకా వెల్లడికాలేదు.

అయితే ఈ పరిణామం అమెరికా, పాకిస్థాన్‌ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయనే సంకేతాలను ఇస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT